యాడ బాయరో
నా బంగారు తెలంగాణ..!
ఎక్కడ బాయరో నా తెలంగాణ ఉద్యమ నినాదం..!
ఏమై పాయరో నీళ్ళు, నిధులు, నియామకాలు..!
ఎవనిపాలాయరో
ఆ కోటి రాతణాల వీణ..!
ఎవనికి కుర్చీలాయరో మరిచిన
ఆత్మహత్యల నినాదాలతో, లక్ష్యాలతో ఉద్యమ త్యాగాలు..!

నా దేశం వెలిగిపోతోంది
ఓవైపు బంగారు తెలంగాణ అన్నరు..!
ఇంకోవైపు డిజిటల్ ఇండియా వెలుగులు అన్నరు..!
ఎత్తైన విగ్రహాల సాక్షిగా
నా తెలంగాణ వెలిగిపోతున్నది..!
దశాబ్ది ఉత్సవాల సాక్షిగా
తెలంగాణ రాఁష్టంలోనే ఈ విధంగా ఉంది అంటే
నా దేశంలోని పరిస్థితి ఆగమ్యగోచరమే..!
డబ్బుతో రాజకీయ నాయకులు
ఓట్లను కొనుక్కొని గద్దలెక్కుతున్నారు..!
వాళ్లకు అనుకూలమైన శాసనాలను తయారు చేసుకొని దేశాన్ని రాష్ట్రాన్ని పాలిస్తున్నారు..!
పేదల హక్కులను కాలరాస్తున్నారు..
పేదరికానికి వాళ్లను ముంచేస్తున్నారు.
పేదరికంలో వాళ్లను ముంచేస్తూ..దేశాన్ని, రాష్ట్రాన్ని
రాష్ట్ర నిధులను, వనరులను దోసుకుంటున్నారు, దోచిపెడుతున్నారు.
ఇంకెంతకాలం భరిద్దాం?
ఇప్పటికైనా ప్రజలు చైతన్యవంతం కావాలి..!
అప్పుడు మాత్రమే మనం,
మన హక్కులు, మనకు చేరాల్సిన, మనకు రావాల్సిన నిధులు మనకు వస్తాయి.
రాబోవు తరాలకు కూడా మిగిలి ఉంటాయి.
లేక పోతే చీకట్లో వెతికున్నట్టే ఉంటాయి మన జీవితాలు..!
బతికినట్టే ఉంటాము కానీ బతకలేము
తిన్నట్టే ఉంటాము కానీ తినలేము..!
దయచేసి ఆలోచించండి హక్కుల కోసం..!
ఎదురుతిరిగి ప్రశ్నించండి అందుకోసం..!!
ఆ కలలు కన్న బంగారు తెలంగాణ కోసం..!!!
– రవి బాబు పిట్టల,
పర్యావరణవేత్త.