వేద న్యూస్, చొప్పదండి

చెడు వ్యసనాలకు అలవాటై ఈజీ మని సంపాదించడానికి దొంగతనాలు చేస్తున్న యువకుడిని చొప్పదండి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ చెడు వ్యసనాలకు లోనై రాగంపేట గ్రామానికి చెందిన కొలిపాక మధు కుమార్ అనే యువకుడు వివిధ చెడు వ్యసనాలకు బానిసై ఈజీగా డబ్బు సంపాదించాలని కోరికతో ఆన్లైన్ లో బెట్టింగ్ యాప్స్ ఆడుకుంటూ డబ్బు సరిపోకపోవడంతో దొంగతనం చేయాలని అనుకున్నాడు. గ్రామంలోని కొమురయ్య ఇంటిలో తేదీ 8 జులై 2025 రోజున పట్టపగలు ఇంటిలో ఎవరు లేని సమయంలో లోపలికి ప్రవేశించి తాళం వేసి ఉన్న బీరువాను పగలగొట్టి అందులో దాచి ఉంచిన ఒక తులం బంగారం, రూ.22 వేల నగదు దొంగిలించాడు. అదే రోజు ఫిర్యాదు తీసుకున్నటువంటి చొప్పదండి ఎస్ఐ నరేష్ రెడ్డి తమ సిబ్బంది తో దర్యాప్తు నిర్వహించి శనివారం ఆ వ్యక్తిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగింది.
అరెస్ట్ అయిన యువకుడి నుండి బంగారం మరియు డబ్బులు రికవరీ చేసి, అతన్ని గౌరవ న్యాయ స్థానం నందు హాజరు పరచారు. ఇట్టి సందర్భాన్ని పురస్కరించుకొని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ ప్రదీప్ కుమార్ యువతకు మంచి ఆలోచన సరళి పెంపొందించుకోవాలని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అదేవిధంగా గ్రామాలలో, ప్రధానమైనటువంటి కూడలిలో గ్రామ ప్రజలు, ఇతర సంఘాల సహకారంతో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిందితున్ని చాకచక్యంగా పట్టుకున్న చొప్పదండి ఎస్ఐ నరేష్ రెడ్డి, సిబ్బంది ఏఎస్ఐ సమ్మయ్య, అనిల్ కుమార్, బి శ్రీధర్, ఎండి ఖలీఫాలను లను ఆయన అభినందించారు.