వేద న్యూస్ ,కాసిపేట:

కాసిపేట మండలంలోని లంబాడి తండా(డీ) గ్రామ పంచాయతీ పరిధిలో గుడుంబా తయారీ, నిల్వ జరుగుతున్నట్టు వచ్చిన సమాచారం మేరకు గురువారం దేవాపూర్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
దేవాపూర్ ఎస్‌ ఐ గంగారాం తన సిబ్బందితో కలిసి తండాలో పలు చోట్ల గుడుంబా నిల్వ చేసిన స్థావరాలను గుర్తించి దాడులు చేపట్టారు పరిశీలనలో భారీగా నిల్వ ఉంచిన గుడుంబాను పోలీసులు స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేశారు.
స్థానికంగా అక్రమ మద్యం తయారీ, విక్రయం వల్ల సామాజిక సమస్యలు తీవ్రంగా పెరుగుతున్నాయని గుర్తించిన పోలీసులు, ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్‌ ఐ గంగారాం హెచ్చరించారు. గ్రామ ప్రజలు కూడా అక్రమ గుడుంబా తయారీ, రవాణా గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.