వేద న్యూస్, వరంగల్ క్రైమ్ :
పోలీస్ శాఖలో మహిళా పోలీస్ సేవలు అభినందనీయమని మట్వాడ సిఐ కరుణాకర్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మట్వాడ పోలీస్ స్టేషన్‌లో సిఐ కరుణాకర్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఆయన మహిళా సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి సన్మానించి,బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు, ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
