వేద న్యూస్,శాయంపేట:
శాయంపేట మండల కేంద్రంలో తహరాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివను నర్సంపేట నియోజకవర్గం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన లో భాగంగా పోలీసులు ముందస్తు అరెస్టు చేసి శాయంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు .ఈ సందర్భంగా బిఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు రాక్షస పాలన నడుస్తుందని బి ఆర్ఎస్ పార్టీ విద్యార్థి యువజన నాయకులను అరెస్టులు చేయడం సరైనదికాదు అన్నారు.ఇది రాష్ట్రంలో నిరంకుశ పాలనకు నిదర్శనమని రాబోయే మూడేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ పతనం ఖాయమని రాష్ట్రంలో ఎక్కడికి అక్కడ అభివృద్ధి ఆగిపోయిందని కెసిఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్ర బాగానా నిలిపారని ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవని వారు గుర్తుచేశారు.