వేద న్యూస్, వరంగల్:
పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా ICDS పరకాల మండలం నాగారం సెక్టార్ వెల్లంపల్లి గ్రామంలో పోషణ పక్షం అవగాహన కార్యక్రమం సెక్టార్ సూపర్‌వైజర్ జే.రాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా పోషకాహారంపై అవగాహన ర్యాలీ చేపట్టి.. ప్రతిజ్ఞ చేయించారు.

పోషకాహార ప్రదర్శన అనంతరం గర్భిణులకు పోషణ సీమంతాలు, ఆరు నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసనలు చేశారు. గ్రోత్ మేళా నిర్వహించి ఆరోగ్యంగా ఉన్న బిడ్డలకి బహుమతులు ప్రదానం చేశారు. అంగన్ వా డీ కేంద్రం ద్వారా ప్రతినెలా పెరుగుదల పర్యవేక్షణ కోసం 0 నుంచి 5 సంవత్సరాల పిల్లల బరువు, ఎత్తు, జబ్బ చుట్టుకొలత తీయడం వాటి ద్వారా పిల్లల పోషణ ఆరోగ్య స్థితిని అంచనా వేస్తున్నట్టు వివరించారు.

పోషణతో ఉన్న పిల్లలకు పర్యవేక్షలతో కూడిన పోషకాహారం, వైద్యం అందించడం., అత్యవసర పరిస్థితుల్లో ఎన్ఆర్ సీకి కి పంపించడం వంటి కార్యక్రమాల గురించి. తల్లులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి పరకాల మండల ఎంఈవో, వెల్లంపల్లి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు రమాదేవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేంద్రసింగ్, ఉపాధ్యాయులు, అంగన్ వాడీ టీచర్లు సుజాత, మమత, పద్మ, హైమవతి , రమాదేవి, స్వర్ణ, మంజుల, సుచరిత, పిల్లల తల్లులు కార్యక్రమంలో పాల్గొన్నారు.