వేద న్యూస్, ఆసిఫాబాద్ ప్రతినిధి:
తపాలా శాఖ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ జిల్లా అధికారి గుంప స్వామి అన్నారు.
బెజ్జూరు గ్రామానికి చెందిన రంగయ్య ఇటీవల అనారోగ్య సమస్యలతో మృతి చెందాడు.
రంగయ్య మూగవెల్లి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ నుండి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా పాలసీ తీసుకోగా నామిని తారాబాయి (మృతుని భార్య) కి రూపాయలు రెండు లక్షలు చెక్కుని వారికి అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఎంజె జెబివై యాక్సిడెంట్ పాలసీ, ఇతర పోస్టల్ పథకాలని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ పోస్టల్ ఇన్స్పెక్టర్ సతీష్ ,(ఐపిపిబి) సీనియర్ మేనేజర్ శ్రీనివాస్ ఇతర పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.