– తపాల శాఖ మహబూబాబాద్ సహాయ పర్యవేక్షకులు సైదా నాయక్
– తపాల శాఖ ఆధ్వర్యంలో మెక్కలు నాటిన సిబ్బంది
వేద న్యూస్, మరిపెడ:
జాతిపిత మహాత్మ గాంధీ యోధుడు అని తపాల శాఖ మహబూబాబాద్ సహాయ పర్యవేక్షకులు లావుడ్యా సైదా నాయక్ అన్నారు. సోమవారం తపాల శాఖ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని మహబూబాబాద్ ప్రధాన తపాలా కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సైదా నాయక్ మాట్లాడుతూ మానవుని మనుగడకు, జీవుల మనుగడకు చెట్లు చాలా ముఖ్యమైనవన్నారు.
చెట్లు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరం అని, చెట్ల వల్లనే ఈ పచ్చని భూమి మన జీవితం ఆనందంగా సాగుతుందని వివరించారు. ఈ చెట్లే నిజమైన యోధులని పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు కాలుష్యంతో పోరాడుతున్నాయని వెల్లడించారు. మనకు పరిశుభ్రమైన గాలి, అందమైన వాతావరణాన్ని అందిస్తున్నాయని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఈరోజు ఒక మొక్క నాటి కాలుష్యరహిత సమాజం చేయాలని పేర్కొన్నారు. ఈ మొక్కలు నాటడం కార్యక్రమంలో కోట సుధాకర్ యస్.పి.యం యస్.వి.న్ రోడ్, వాసం అనిల్ కుమార్ సిపిసి బ్రాంచ్ ఇంచార్జ్, రామగిరి ప్రభాకర్ ట్రెజరర్, కోట సురేష్ యస్.పి.యం న్యూయాబాది, నరసయ్య యస్.పి.యం కంబాలపల్లి, బి. వెంకన్న యం.టి.స్ మహబూబాబాద్, ప్రధాన తపాల కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.