వేద న్యూస్, మరిపెడ:
అమరవీరుల త్యాగాలకు గుర్తుగా తపాల శాఖ ఆధ్వర్యంలో ‘మేరా మిట్టి- మేరా దేశ్’ కార్యక్రమం నిర్వహించారు. శనివారం చిన్నగూడురు మండలం విసంపల్లి గ్రామంలో తపాల శాఖ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్ర సంఘటితం సహకారంతో అమరవీరుల త్యాగాలకు గుర్తుగా ‘మేరా మిట్టి- మేరా దేశ్’ కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు గారి సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా అమరవీరులైన సంకినేని నరసింహారావు, అనపర్తి రామయ్య, షేక్ సయ్యద్, మీసాల వెంకయ్య కుటుంబ సభ్యులు..వారసుల తోటి ఈ ‘మేరా మిట్టి- మేరా దేశ్’ కార్యక్రమం నిర్వహించారు. మేళ తాళాలతో అట్టహాసంగా ‘మట్టి కా నమన్ వీరోన్ కా వందన్’, ‘అమృత కలశ యాత్ర’ విసంపల్లి గ్రామంలో చేపట్టారు. ఈ యాత్రలో గ్రామ సర్పంచ్ సంకినేని విద్యులత వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ కొండ మురళి, సంకినేని సత్యనారాయణరావు, తపాల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అమరవీరులకు త్యాగాలకు గుర్తుగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తపాల శాఖ మహబూబాబాద్ సహాయ పర్యవేక్షకులు లావుడ్యా సైదా నాయక్ తెలిపారు.