వేద న్యూస్, చొప్పదండి:

చొప్పదండి పట్టణంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో పౌర్ణమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు ఉదయం జ్ఞాన సరస్వతి అమ్మవారికి అభిషేకాలను నిర్వహించారు. ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించి ఆశీర్వచనాలను అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు సింహాచలం జగన్మోహన్ స్వామి, శ్రీ భాష్యం నవీన్ కుమార్లు భక్తులకు పూజా కార్యక్రమాలను నిర్వహించి ఆశీర్వచనాలను అందజేశారు. అనంతరం అమ్మవారి పల్లకి సేవలు అశేష భక్త జన సంద్రంలో నిర్వహించారు. పలువురు భక్తులు అమ్మవారి పల్లకి సేవలో తరించి అమ్మవారి కృపకు పాత్రులైనారు. అనంతరం అన్న ప్రసాద వితరణ నిర్వహించారు.