వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి:

విద్యుత్ శాఖ ఉద్యోగులు విధి నిర్వహణలో శభాష్ అనిపించుకున్నారు. వీణవంక మండల పరిధిలోని పోర్టల్ లైన్ మెన్ దొడ్డే భాస్కర్, అసిస్టెంట్ లైన్ మెన్ పిట్టల శ్రీకాంత్ తమ విధి నిర్వహణ ను చక్కగా నిర్వర్తించారు.

కరెంటు లైన్ లు సరిచేసే క్రమంలో మానేరులో బురద లోనే పని చేశారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న వారిని గ్రామ ప్రజలు అభినందనలతో ముంచెత్తారు.