వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి :
మిర్యాలగూడ మండలం దుబ్బ తండా గ్రామానికి చెందిన మాలోతు బద్రు (60) అనే వ్యక్తి శ్రీనివాస నగర్ గ్రామ శివారులోని మాలోతు బాలు అనే రైతు పొలం వద్దకు ఆదివారం పచ్చ గడ్డి కోయడం కోసం వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో పొలంలోని బోరుబావి వద్ద పచ్చగడ్డి కోస్తుండగా ప్రమాదవశాత్తు కొడవలి బోరు మోటర్ కరెంటు వైర్ కు తగిలి కరెంట్ షాక్ తో చనిపోయాడు.మృతుని గురించి వెతుకుతున్న కుటుంబ సభ్యులు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మాలోతు బాలు పొలంలో మృతుని శవాన్ని గుర్తించి మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి శవాన్ని తరలించడం జరిగింది.మృతుని కుమారుడు మాలోతు లచ్చు సాధ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మిర్యాలగూడ రూరల్ ఎస్సై తెలిపారు.