• పీడీఎస్ యూ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ కు వినతి

వేద న్యూస్, జమ్మికుంట:

జమ్మికుంటప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీ ప్రాంగణంలో ప్రహరీ గోడ నిర్మించాలని పీడీఎస్ యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో పీడీఎస్ యూ నాయకులు సోమవారం కాలేజీ ప్రిన్సిపాల్ కు వినతిపత్రం సమర్పించారు. గత కొన్ని సంవత్సరాల నుండి ప్రహరీ గోడ లేకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని పేర్కొన్నారు.

బయట వ్యక్తులు లోపలికి రావడంతో అనేక రకాల సమస్యలు విద్యార్థులు ఎదుర్కొంటున్నారని వివరించారు. వెంటనే ప్రహరీ గోడ నిర్మించి డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థులకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రహరీ వెంటనే నిర్మించని యెడల పీడీఎస్ యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఓజ్జా శ్రీకాంత్, జక్కుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.