వేద న్యూస్, వరంగల్:
హనుమకొండ జిల్లా దామెర మండల పరిధిలోని పులుకుర్తి గ్రామ పంచాయతీ ఆవరణలో కారోబార్ గోవిందు ఆనంద్ అధ్యక్షతన ప్రజా పరిపాలన దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామపంచాయతీ కార్యదర్శి హర్షం శ్రీను హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు.
కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు గోవిందు అశోక్, పెరుక సత్యం, గన్ను సరస్వతి వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ డైరెక్టర్ ఈదునూరి సంతోష స్వామి, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల మురళి మాదిగ ,మాజీ వార్డ్ మెంబర్స్ సూరచందర్, పెరుక రాధా రాణి రాజు, పేర బోయిన కిరణ్ కుమార్ యాదవ్, గ్రామ కో ఆప్షన్ మెంబెర్ నేతని మదన్మోహన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోవిందు ఆదాం, ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ దామేర మండల అధ్యక్షుడు గోవింద ప్రేమ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముండ్రాతి బిక్షపతి, లింగాల రాజు, అంగన్వాడి టీచర్ తాళ్లపల్లి జయ, ఆశ వర్కర్స్ పాముల రమణ, దేవిక, గ్రామపంచాయతీ సిబ్బంది జిల్లెల్ల వనజ, కావ్య , వజ్ర, స్వరూప, ప్రభాకర్, సుధాకర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.