వేద న్యూస్, మరిపెడ:

తెలంగాణా ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరిపెడ లో మంగళవారం ‘జెండా ఆవిష్కరణ’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ. అనంతరావు మాట్లాడారు. అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ జాతి అస్థిత్వానికి మార్గదర్శకాలు అని చెప్పారు.  వారి ఆదర్శాలు విద్యార్థులకు స్ఫూర్తి దాయకమని కొనియాడారు. కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు రామ్మోహన్ బయగాని, దేవులా, నెహ్రూ, స్వప్న, ప్రకాష్, రమేష్ రెడ్డి, ప్రసాదరావు, సారయ్య, జహేదా బేగం, సురేష్, బాబూరావు, అనిత, సుధా, మంజుశ్రీ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.