వేద న్యూస్, ఆసిఫాబాద్:
తెలంగాణ రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేపల్లి నంద, రిటైర్డ్ జస్టిస్ మాధవరావు దంపతులకు హైదరాబాద్ లోని వారి నివాసంలో ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు బోనగిరి సతీష్ బాబు ఆధ్వర్యంలో నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు.

అనంతరం అయోధ్య శ్రీరాముని అక్షింతలను బీసీ యువజన సంఘం కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్..హై కోర్టు జడ్జి సురేపల్లి నంద కు అందజేశారు. ఈ సందర్బంగా వారు ఎంతో ఆనందంగా అక్షింతలను స్వీకరించి రాముని కృపతో దేశం సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షించారు.