• నూతన బైక్ పాయింట్ ప్రారంభించిన యువ నాయకులు ఆవిడపు ప్రణయ్ కుమార్

వేద న్యూస్, ఆసిఫాబాద్:

యువత, వ్యాపారం స్వయం ఉపాధి రంగాన్ని ఎంచుకొని రాణించాలనీ బీసీ యువజన సంఘం కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ అన్నారు. జిల్లా లోనీ జన్కాపూర్ లో వడై బిక్కు.. నూతన బైక్ మెకానిక్, సర్వీసింగ్ ఆటోమొబైల్ దుకాణం ను ప్రణయ్ ముఖ్య అతిథి గా హాజరై.. రిబ్బన్ కట్ చేసి షాప్ ను ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మెకానిక్ షాప్ దిన దిన అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించారు.

అనంతరం మెకానిక్ షాప్ యజమాని బిక్కు కు బీసీ యువజన సంఘం నాయకులు కానుకను అందజేశారు. బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ ను వడై బిక్కు, వారి కుటుంబ సభ్యులు శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమం లో బీసీ యువజన సంఘం ఆసిఫాబాద్ డివిజన్ అధ్యక్షులు బొట్టుపల్లి ప్రశాంత్, బీసీ సంఘం ఆసిఫాబాద్ మండల్ అధ్యక్షులు సిరికొండ సాయి కృష్ణ, యువ నాయకులు నాగోషే బాలాజీ, బుద్ధజీ, ఆవిడపు తరుణ్, జంజీలాల ప్రణయ్, అనుమాండ్ల సిద్ధార్థ, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.