వేద న్యూస్, నెక్కొండ:
గొల్లపల్లి అంబేద్కర్ యువజన సంఘం అధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో భాగంగా చంద్రుగొండ ప్రభుత్వ పాఠశాల, క్రాంతి హై స్కూల్ కు చెందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ ప్రోత్సాహ బహుమతులను అంబేద్కర్ యువజన సంఘం నెక్కొండ మండల ఉపాధ్యక్షుడు మాదారపు మహేందర్, గొల్లపల్లి గ్రామ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు బిర్రు మధుకర్, భగత్ సింగ్ యూత్ సభ్యులు నాగపురి పవన్, అప్పం అమరేష్ శుక్రవారం అందజేశారు.
కార్యక్రమంలో అయా పాఠశాలల ప్రానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి ముందు ఉండి నడిపించిన నెక్కొండ మండలం కరెంటు ఏఈ బట్టు చిరంజీవికి అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.