- మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపు మేరకు..
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలు, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ సూచనల మేరకు..
- పిల్లలతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు, స్వెటర్స్ పంపిణీ
వేద న్యూస్, వరంగల్:
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఇచ్చిన ‘దావతులు మానండి- దాతలుగా మారండి’ అనే పిలుపు మేరకు కేటీఆర్ సేన వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆంగ్ల నూతన సంవత్సరాది అయిన బుధవారం సేవా కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ సూచన మేరకు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 19 వ డివిజన్ పరిధి ఓ సిటీ.. సొసైటీ కాలనీ మదర్ థెరిస్సా అనాథాశ్రమంలో స్వెటర్స్ పంపిణీ చేశారు. అనాథాశ్రమంలోని పిల్లలకు స్వీట్సు, ఫ్రూట్స్ అందజేశారు. ఫుడ్ ఐటెమ్స్ ఇచ్చారు.

అనంతరం ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేశ్ మైనాల మాట్లాడుతూ .. మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపు మేరకు తాము తమకు తోచినంతో సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్టు వెల్లడించారు. యువత మత్తు పదార్థాలు, డ్రగ్స్, ధావత్ లను బంద్ చేసి.. సేవా కార్యక్రమాలను తమకు తోచినంతలో చేపట్టాలని కోరారు. కేటీఆర్ సేన నేతలు అశోక్ తదితరుల సహకారంతో మదర్ థెరిసా ఆశ్రమంలో ప్రోగ్రామ్ ను నిర్వహించినట్టు వెల్లడించారు.