వేద న్యూస్, మరిపెడ:

మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని మరిపెడ ఉన్నత పాఠశాలలో ఎస్సై గండ్ర సంతోష్ కుమార్ సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సప్ వాడడంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.  ఫొటోలు అప్లోడ్ చేసినట్లయితే వాటిని మార్ఫింగ్ చేసి డబ్బుల కోసం సైబర్ నేరగాళ్లు బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉన్నదని వివిధ ఉదాహరణలతో వివరించారు.

ఎట్టి పరిస్థితుల్లోను బ్యాంకు ఎకౌంట్ నెంబర్ గాని, ఓటీపి లు గాని ఫోన్ లో ఎవరికీ చెప్పరాదని అన్నారు. పిల్లలు మొబైల్ లో గేమ్స్ ఆడటం ద్వారా కూడా వారి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పొదుపు చేసుకున్న డబ్బులను కోల్పోతున్నారు. విద్యార్థులు ఇంటికెళ్లాక వారి కుటుంబ సభ్యులకు, ఇరుగుపొరుగు వారికి స్నేహితులకు అవగాహన కలగ చేయాలని చెప్పారు.

వారికి ఎలాంటి సమస్యలున్నా డయల్ 100 కు ఫోన్ చేయాలని అన్నారు. సైబర్ నేరాలకు సంబంధించిన విషయాలు నేరం జరిగిన వెంటనే 1930 కు ఫోన్ చేసి చెప్పాలని అన్నారు. విద్యార్థినీ విద్యార్థులు ఒక గోల్ ఎంచుకొని తగిన విధంగా కృషిచేసి గమ్యం చేరుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతరావు, స్టాఫ్ సెక్రటరీ బయగాని రామ్మోహన్, ఏఎస్ఐ హనుమంతు, హెడ్ కానిస్టేబుల్ వీర్య, కానిస్టేబుల్ శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.