- గులాబీ పార్టీ మహేశ్వరం అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి
వేద న్యూస్, మహేశ్వరం:
ప్రజాక్షేమమే బీఆర్ఎస్ ధ్యేయం అని ఆ పార్టీ మహేశ్వరం ఎమ్మెల్యే అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఆమె నియోజకవర్గ పరిధిలోని బాలాపూర్, బాలాజీ నగర్, జల్ పల్లి, సుల్తాన్ పూర్ తదితర ప్రాంతాలలో ప్రచారం చేశారు. కేసీఅర్..ప్రజల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి మీ సబితమ్మను గెలిపించుకోవాలని జనాన్ని అభ్యర్థించారు.
రాబోయేది గులాబీ పార్టీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే నెం.1గా అభివృద్ధి చెందిందని సబిత స్పష్టం చేశారు. తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకే దక్కుతుందని వెల్లడించారు. హ్యాట్రిక్ సీఎంగా దక్షిణ భారతదేశంలో కేసీఆర్ రికార్డు సృష్టించడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తీగల కృష్ణారెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.