వేద న్యూస్, మిర్యాలగూడ ప్రతినిధి :
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులు దైద శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన భారత వీర జవాన్లకు ఘన అశ్రునివాళ్లు అర్పించారు. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకు వెళుతున్న వాహనాల కాన్వాయ్ లేతిపుర (అవంతిపుర సమీపంలో ) కారుతో ఆత్మహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది రిజర్వు పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ సైనికులు వీరమరణం పొందారు. ఈ ఘటనలో ప్రాణాలర్పించిన భారత వీర జవాన్లను స్మరిస్తూ శుక్రవారం నివాళులు అర్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధీరావత్ ధర్మానాయక్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత సైన్యంలో చేరి దేశానికి ఉన్నతమైన సేవలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొర్ర కృష్ణ కాంత్ నాయక్, నరసింహ అడ్వకేట్,సంజయ్ కుమార్, పి .సురేందర్, వి.శంకర్, చిలుములవెంకట్ ,గోపి, చిలుమల కొండల్, దైదశ్రీకాంత్, రోహిత్ , విజయ్, వి .రాజు, వెంకటేష్, శరత్, వి.రాజ్ కుమార్, అవినాష్, రవి,సాయినాథ్, బి .సైదులు, ఈట గిరి, చింటూ, శ్రీకాంత్, సైదులు, దైద రవి, కిషోర్ మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.