వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గ పరిధిలో శ్రీ బాలాజీ హోటల్‌ను బీఎస్పీ వరంగల్ తూర్పు నియోజకవర్గ ఇన్ చార్జి ట్రాన్స్ జెండర్ చిత్రపు పుష్పితలయ ప్రారంభించారు.

ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని ను రిబ్బన్ కట్ చేశారు. హోటల్ చక్కగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

వరంగల్ రంగశాయిపేట్ 5వ డివిజన్ లో జరిగిన ఈ ప్రారంభోత్సవంలో ఓనర్ కొరే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ హోటల్ ఓపెనింగ్ కు ముఖ్య అతిథిగా హాజరైన పుష్పితలయ హోటల్ ప్రారంభం అనంతరం టీ తాగుతూ సరదాగా అందరితో ముచ్చటించారు. హోటల్ ఓనర్ కు మంచి లాభాలు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కస్టమర్లను గౌరవించాలని, వారికి క్వాలిటీ ఫుడ్ ప్రొడక్ట్స్ అందించాలని సూచించారు.