Oplus_16908288
  • రాశి స్విఫ్ట్ “మెగా ఫీల్డ్ డే”
  •  అధిక దిగుబడినిచ్చే రకం పత్తి విత్తనం “రాశి స్విఫ్ట్”: కంపెనీ అధికారులు

వేద న్యూస్, ఇల్లందకుంట:

 

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం మర్రివానీపల్లె గ్రామంలో రైతు రాజిరెడ్డి పత్తి చేనులో మంగళవారం రాశి సీడ్స్ ప్రైవేటు లిమిటెడ్ వారు క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రీజినల్ బిజినెస్ మేనేజర్ ప్రదీప్ కుమార్, టెర్రిటరీ సేల్స్ మేనేజర్ వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ.. రాశి స్విఫ్ట్ అనే హైబ్రిడ్ పత్తి తొందరగా కాపుకు వచ్చే రకమని, ప్రతికూల వాతావరణం లో రసం పీల్చె పురుగులను సమర్థవంతంగా తట్టుకొని ఎక్కువ కాయలను నిలుపుకునే సామర్థ్యుం కలిగి ఉంటుందన్నారు.

రైతులకు అత్యధిక దిగుబడిని ఇచ్చే రకమని రైతులకు వివరించారు. కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి 400 మంది పత్తి రైతులు,డీలర్లు, కంపెనీ డిస్ట్రిబ్యూటర్లు ప్రకాష్ ఫర్టిలైజర్ సతీష్ అలాగే కంపెనీ సిబ్బంది గడ్డి శ్రీనివాస్, హరీష్, కోట శ్రీనివాస్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.