: ఎస్సై గోవర్ధన్

వేద న్యూస్, నల్లబెల్లి :

భారీ వర్షాల కారణంగా మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటికి రాకూడదని నల్లబెల్లి ఎస్సై వి గోవర్ధన్ సూచించారు. శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ స్తంభానికి, విద్యుత్తు పరిసరాలకు దూరంగా ఉండాలని అన్నారు. వాహనదారులు రోడ్డుమీద అత్యంత వేగంగా ప్రయాణించవద్దని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కల్వర్టుల పరిసర ప్రాంతంలో ఉండవద్దని కోరారు. యువకులు చెరువులు వాగుల్లో చేపలు పట్టేందుకు వెళ్ళావద్దన్నారు. గొర్ల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని చెట్ల ఉండకూడదని పేర్కొన్నారు. రైతులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్ళేటప్పుడు కరెంటు మోటార్లతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.అత్యవసర సమయంలో సాయం కొరకు డయల్ 100 లేదా పోలీస్ స్టేషన్ నెంబర్ 8712685233 ద్వారా పోలీసులను సంప్రదించాలని వారు విజ్ఞప్తి చేశారు.