సోదరీమణులు అత్యంత వైభవంగా రాఖీ పండుగను జరుపుకుంటున్నారు. సోదర భావం పవిత్రతను పెంపొందించడమే ఈ ఫెస్టివల్ సందేశమని పలువురు పేర్కొంటున్నారు.
పురాణాల ప్రకారం.. పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య 12 సంవత్సరాల భీకర యుద్ధం జరిగింది. ఆ సమయంలో దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తలదాచుకుంటాడు. భర్తను గమనించిన ఇంద్రాణి యుద్ధంలో పోరాడడానికి పార్వతీ పరమేశ్వరులను పూజించి భర్త దేవేంద్రుడి చేతికి రక్ష కట్టి యుద్ధానికి పంపుతుంది.
అలా వెళ్లిన దేవేంద్రుడు సమరంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని పొందుతాడు. భార్యలు భర్త క్షేమాన్ని, పురోగతిని, తలపెట్టిన పనిలో విజయం సాధించాలని ఆశిస్తూ రాఖీని కట్టవచ్చు.
