- గాంధీభవన్ లో ఇన్ చార్జి భాస్కర్ కు అప్లికేషన్ అందజేత
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
గాంధీభవన్ లో ఇన్ చార్జి భాస్కర్ కు రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షులు ప్రీతంతో కలిసి డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ వరంగల్ ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు సమర్పించారు. వరంగల్ పార్లమెంట్ స్థానంలో పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేయబోతున్నట్లుగా డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ ఈ సందర్భంగా శనివారం వెల్లడించారు.
రామకృష్ణ మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరాల కాలంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా న్యాయం జరగలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ప్రజలకి హామీలు నెరవేరుతాయని నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని ఆదరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ ఎంపీ ఆస్పిరెంట్ లను కూడా ప్రజలు ఆహ్వానించాలని రామకృష్ణ కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేల ఆశీస్సులతో తనకు వరంగల్ పార్లమెంట్ స్థానంలో అవకాశం కల్పిస్తే ప్రజల ఆశీస్సులతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
వరంగల్ పార్లమెంట్ జనాభా 15 లక్షలా 70 వేలకు పైచిలుకు ఉంటుందని పేర్కొన్నారు. వరంగల్ అభివృద్ధి కోసం పని చేస్తానన్నారు. ఎయిర్ పోర్ట్ ను వరంగల్ కు తీసుకురావాలని, అలాగే సైనిక్ స్కూల్ కాజీపేట కు కోచ్ ఫ్యాక్టరీ తీసుకురావాలని పేర్కొన్నారు.