•  బెస్ట్ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి
  • వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
కేంద్ర మాజీమంత్రి, బెస్ట్ పార్లమెంటేరియన్ దివంగత జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ రామకృష్ణ జైపాల్ రెడ్డి సమాధివద్ద పుష్పాలు వేసి నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రావడానికి ముఖ్యపాత్ర పోషించిన జైపాల్ రెడ్డికి నివాళులు అర్పించినట్లు తెలిపారు.

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీత, కుటుంబ సభ్యులను, జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మామ పద్మాకర్ రెడ్డి, చిన్న మామ మనోహర్ రెడ్డిని..వరంగల్ ఎంపీ అస్పిరేంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కలిశారు.

రామకృష్ణ వెంట కాంగ్రెస్ పార్టీ వరంగల్ నాయకులు జోసెఫ్ ప్రభాకర్ లాజరస్, సామ్ ఎలియా మహేష్, మధు తదితరులున్నారు.