వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ చార్జి దీపా దాస్ మున్షి ని వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ గురువారం మీడియాతో మాట్లాడుతూ దీపాదాస్..లోక్ సభలో పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికై 2012 నుండి 2014 వరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేశారనీ, దీపా దాస్ మున్షిని 2023 డిసెంబర్ 23న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇన్ చార్జిగా నియమించారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రానికి దీప దాస్ మున్షిని ఇన్ చార్జిని నియమించడం చాలా సంతోషకరమని డాక్టర్ రామకృష్ణ పేర్కొన్నారు. డాక్టర్ రామకృష్ణ రాజకీయాల గురించి రానున్న పార్లమెంట్ ఎన్నికల గురించి చర్చించారు. తనకు అవకాశం కల్పిస్తే వరంగల్ ఎంపీ గా బరిలో ఉంటానని..అదేవిధంగా వరంగల్ నగర ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం జరిగేలా కృషి చేస్తానని రామకృష్ణ స్పష్టం చేశారు.