వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
అదాలత్ వరంగల్ కోర్టులోని న్యాయవాదులను వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి రామకృష్ణ వారితో చర్చించారు.

ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. అందరి సహకారం ఉన్నందువల్లనే ప్రజలకు మంచి జరిగిందని చెప్పారు.

రానున్న పార్లమెంట్ ఎన్నికలకు మీ వంతు సహాయ సహకారాలు ఉండాలని..కాంగ్రెస్ పార్టీ నుండి వరంగల్ ఎంపీ బరిలో తాను ప్రయత్నం చేస్తున్నానని న్యాయవాదులకు తెలియజేస్తూ.. న్యాయవాదులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా కోర్టు న్యాయవాదులు పాల్గొన్నారు.