వేద న్యూస్, కరీంనగర్:
అపర భద్రాద్రిగా పేరు గాంచిన ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి వారి ఆలయ కమిటీ చైర్మన్‌గా ఇంగిలె రామారావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది కాలం పాటు రామారావు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇల్లందకుంట మండల పరిధిలోని శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన రామారావు కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా పేరు సంపాదించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన ఆయనకు ఈ పదవి వరించడం పట్ల హస్తం పార్టీ వర్గీయులు, నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన నాయకుడైన రామారావు ఇల్లందకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలందించారు.