వేద న్యూస్, వరంగల్ టౌన్:
గ్రేటర్ వరంగల్ నగరంలోని 42 వ డివిజన్ రంగశాయిపేట పరిధిలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం సీతారాముల కల్యాణానికి శాలివాహనులు (కుమ్మరి) కులస్తులు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. శాలివాహనులంతా ఏకమై సంఘం భవనంలో తలంబ్రాలు, కళ్యాణానికి జీలకర్ర బెల్లం కలిపి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు మరియు పూల మాలలు నెత్తిన పెట్టుకొని సంఘ సభ్యులంతా డోలు వాయిద్యాలతో ఊరేగింపుగా ఆలయానికి బయలుదేరారు. ఆలయంలో సీతారామ కళ్యాణ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక కార్పొరేటర్ గుండు చందన పూర్ణ చందర్, మాజీ కార్పొరేటర్ కేడల పద్మ జనార్దన్ సమక్షంలో వేద బ్రాహ్మణులకు ఇట్టి పూజా ద్రవ్యాలను అందజేశారు.
ఈ సందర్భంగా శాలివాహన సంఘం అధ్యక్షుడు ఆవునూరి రవి, ఉపాధ్యక్షుడు ఆవునూరి కుమారస్వామి మాట్లాడుతూ రంగశాయిపేట గ్రామము, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ శ్రీరామచంద్రునికి శాలివాహనుల తరుపున పట్టువస్త్రాలు సమర్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవునూరి లక్ష్మి, సుభద్ర, లింగమూర్తి, రమేష్, రాజు, దేవేందర్, మల్లేశం, బిక్షపతి, కృష్ణ, మోహన్, వంశీ, కుమారస్వామి, సారయ్య, సురేష్, చిరంజీవి, శ్రీనివాస్, వీరేశం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.