వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి  హయాంలో ఉన్న ‘ప్రభుత్వ మద్య విమోచన ప్రచార కమిటీ’ని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పునరుద్ధరించాలని ఆ ప్రచార కమిటీ డైరెక్టర్ దాసి రాందేవ్ కోరారు. ఈ మేరకు ఆయన గురువారం హైదరాబాద్ లో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతి పత్రం సమర్పించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్న మద్య విమోచన ప్రచార కమిటీని పునరుద్ధరించాలని రాందేవ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కల్తీమద్యం, గుడుంబా, బెల్ట్ షాపులపై నిషేధం కోసం నిషేధ కమిటీ ఉండాలని రాందేవ్ అభిప్రాయపడ్డారు. ప్రచార కమిటీ ద్వారా పలు విషయాలపై ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ‘మద్య విమోచన ప్రచార కమిటీ’ని పునరుద్ధరించాలని రాందేవ్ మంత్రిని కోరారు.