వేద న్యూస్, కమలాపూర్:
తెలంగాణ రైతు రక్షణ సమితి(టీఆర్ఆర్ఎస్) కమలాపూర్ మండల అధ్యక్షులుగా నూనె రమేశ్ నియమితులయ్యారు. ఆ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహరి రావు, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వరికేల కిషన్ రావు ఆదేశాల మేరకు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల అధ్యక్షునిగా శనిగరం గ్రామానికి చెందిన నూనె రమేష్‌ను నియమించినట్లు సమితి జిల్లా అధ్యక్షులు భాస్కర్ తెలిపారు.

ఈ మేరకు రమేశ్ కు మండల అధ్యక్షునిగా నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షులు హింగె భాస్కర్, నాయకులు కిషన్ రావు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ తన నియమకానికి సహకరించిన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికేల కిషన్ రావుకు, జిల్లా అధ్యక్షులు భాస్కర్ కు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి..వాటి పరిష్కారానికి కృషి చేస్తానని రమేశ్ స్పష్టం చేశారు. అన్నదాత పక్షాన తెలంగాణ రైతు రక్షణ సమితి అన్నదాతకు అండగా ఉంటుందని వెల్లడించారు.