- భక్తిశ్రద్ధలతో హాజరైన భక్త జనం
వేద న్యూస్, హన్మకొండ:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం నర్సింహులపల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కన్నుల పండువగా రాములోరి కల్యాణం బుధవారం జరిగింది. కమిటీ సభ్యులు కల్యాణ మండపాన్ని సుందరంగా తీర్చిదిద్ది, సకల గుణాభి రాముడు,పితృవాక్య పరిపాలకుడు, సీతారాముల కల్యాణానికి ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేశారు. శ్రీ సీతారాములొరీ కల్యా ణం బుధవారం అంగరంగ వైభవంగా వేద పండితుల మంత్రోచ్ఛారణాల నడుమ జరిగింది.
మహిళలు ఇంట్లో నుండి అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివార్లకు ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలను తీసుకువచ్చి మొక్కులను సమర్పించారు. రాములోరి కళ్యాణాన్ని వీక్షించిన అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం దాతలు నిర్వహించారు. రాత్రివేళ రాములోరి వద్ద భక్తులు భజనలు చేశారు. కార్యక్రమంలో భక్తులు,గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.