Oplus_131072

వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి :

రంజాన్ మాసంలో స్వచ్ఛంద సేవా సంస్థ అయినటువంటి జనయేత్రి ఫౌండేషన్ 120 మంది ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్లను పంపిణీ చేసింది.ఈ సందర్భంగా జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చైర్మన్ డా.మునిర్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులంతా రంజాన్ ఉపవాస దీక్షలను భక్తి, శ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.జనయేత్రి ఫౌండేషన్ సేవలు అన్ని వర్గాల ప్రజలకు చేరువ అవుతున్నందుకు గర్వంగా,ఆనందంగా ఉందన్నారు.మిర్యాలగూడ పట్టణంలో జనయేత్రీ ఫౌండేషన్ కార్యాలయం ఆవరణలో ముస్లిం సోదర,సోదరీమణులకు ఆదివారం రోజు 120 నిరుపేద కుటుంబాలకు రంజాన్ కిట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి కుల మతాలకతీతంగా ఉభయ రాష్ట్రాలలో ఉన్నటువంటి జనయేత్రీ ఫౌండేషన్ సభ్యులు సహకరించిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేశారు.కోవిడ్ సృష్టించిన కల్లోలం నుంచి లక్షలాది కుటుంబాలు ఇంకనూ కొలుకోలేదని అన్నారు.నిరుపేద ముస్లింలకు రంజాన్ పవిత్ర మాసంలో శక్తివంచన లేకుండా సాయం అందించేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

నిబద్ధతకు నిలువెత్తు దర్పణం

నిబద్ధత, అంకిత భావంతో సేవలందించడంలో డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటారని జనయేత్రీ ఫౌండేషన్ నల్గొండ జిల్లా అధ్యక్షులు పల్లె కిషోర్ కుమార్ తెలిపారు.మరొక ముఖ్య అతిథిగా హాజరైన ముస్లిం మత పెద్ద ముఫ్తిఇమ్రాన్ మాట్లాడుతూ ఓ వైపు వృత్తి ధర్మాన్ని నిబద్ధత,అంకితభావంతో నిర్వర్తిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ప్రశంసించారు.కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో వందలాది కుటుంబాలకు బియ్యం,నిత్యావసర సరుకులను, మందులను పంపిణీ చేశారు.ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు పరీక్షా సామాగ్రిని,నిరుపేదలకు తన వంతుగా మందుల పంపిణీ కూడా చేయడం జరుగుతుంది.కులమాతాలకతీతంగా కార్తీక మాసంలో దీక్షలో ఉన్న భక్తులకు అన్నదాన కార్యక్రమాలు చేశారు,సమాజంలో ప్రతి ఒక్కరూ నిరాశ్రయులకు నిస్సహాయులకు నిర్భాగ్యులకు ఎంతో కొంత సహాయ సహకారాలు అందిస్తూ మానవ జన్మకు సార్ధకం చేసుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా జనయేత్రీ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ పల్లె కిషోర్ కుమార్,ముస్లిం మత పెద్ద ముఫ్తి ఇమ్రాన్,నల్గొండ జిల్లా కార్యదర్శి తాజ్ బాబా,మహిళా అధ్యక్షురాలు జరీనా,కొమరోజు యాదగిరి, అమీర్అలీ,షాహిర్,రఫీ,సీతారాం,సందీప్,ఫహీం,రషీద్,రుబీనా,రుహీన,జరిన,సన,మేఘన,షంషు,సుబ్రహ్మణ్యం,సాదిక్,రోహిద్,అహ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.