వేద న్యూస్, వరంగల్ జిల్లా : 

ఎంతో నిష్ఠ‌తో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో ముస్లిం సోద‌రులు జ‌రుపుకొనే పవిత్ర పండుగ‌ రంజాన్ సంద‌ర్భంగా వరంగల్ జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ సత్య శారద శుభాకాంక్ష‌లు తెలిపారు. అల్లాహ్ దీవెనలతో జిల్లా ప్ర‌జ‌ల‌కు సుఖ‌, సంతోషాలు, స‌క‌ల శుభాలు క‌ల‌గాల‌ని, ఆయురారోగ్యాల‌తో జీవించాల‌ని ఆకాంక్షించారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌, దాతృత్వం, ధార్మిక చింత‌న‌ల క‌ల‌యికే రంజాన్ మాసం విశిష్ట‌త అని ఆమె పేర్కొన్నారు. నెల రోజుల పాటు క‌ఠోర దీక్ష‌తో నిష్ఠ‌గా అల్లాను ఆరాధిస్తూ అత్యంత క్ర‌మ శిక్ష‌ణ‌తో కూడిన‌ ఆధ్యాత్మిక జీవనం కొన‌సాగిస్తార‌ని గుర్తు చేశారు. అల్లా కరుణ‌, ద‌య‌, కృప‌తో ముస్లిం సోద‌ర, సోద‌రీమ‌ణులు ర‌క్ష‌ణ పొందాల‌ని, కుటుంబ స‌భ్యుల‌తో పాటు ఆనందాల న‌డుమ రంజాన్ ప‌ర్వదినాన్ని సంతోషంగా జ‌రుపుకోవాల‌ని కలెక్టర్ ఆకాంక్షించారు. మ‌త సామ‌ర‌స్యానికి ప్ర‌తీక‌గా నిలిచే ఈ పండుగ వేళ అంద‌రూ సోద‌ర‌భావంతో మెల‌గాల‌ని ఈ సంద‌ర్భంగా విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు ముస్లిం సోద‌రులకు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఆదివారం కలెక్టర్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.