• అన్నివర్గాలకు అండగా నిలుస్తున్న వ్యక్తి
  • నియోజకవర్గవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు
  • స్వతంత్ర అభ్యర్థిగా భూపాలపల్లి నుంచి బరిలో బీసీ బిడ్డ
  • బలమైన నాయకుడిగా, ప్రజల గొంతుకగా దూసుకెళ్తున్న యువనేత

వేద న్యూస్, భూపాలపల్లి:

ఉదయం లేచింది మొదలు..జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందు నిలిపేందుకు ఆలోచనలు చేయడం..బాధ్యతగా సర్కార్ చేయాల్సిన పనులను ఎప్పటికప్పుడు గుర్తు చేయడం..అధికారులను, ప్రజా ప్రతినిధులను కలిసి సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేయడం..అవసరమైతే తానే రంగంలోకి దిగి బాధితుల తరఫున కొట్లాడటం ఆయన దినచర్య అని చెప్పొచ్చు. ముఖ్యంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందు వరుసలో నిలపాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్నారు ఆ యువనేత.

ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ..‘అన్నా’ అని పిలిచి సాయం కోరిన వారందరికీ దాదాపుగా తనకు తోచినంతలో ‘నేనున్నా’ అనే భరోసానిచ్చి..ఆర్థికంగా సాయం చేస్తున్నారు. సామాజిక సేవతో పాటు నియోజకవర్గవ్యాప్తంగానే కాదు జిల్లావ్యాప్తంగా ఉన్న పలు సమస్యల పరిష్కారానికి తన వంతు పోరాటం చేస్తున్నారు. ఇదీ సంక్షిప్తంగా భూపాపలపల్లి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కౌటం రవిపటేల్ నిత్య కార్యక్రమాలని చెప్పొచ్చు.

2018లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా భూపాలపల్లి నుండి పోటీ చేసిన రవిపటేల్.,2021లో ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా(పట్టభద్రులు) ఎలక్షన్స్ వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి పోటీ చేశారు. ప్రస్తుతం తీన్మార్ మల్లన్న టీం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కమిటీ మెంబర్ గా కొనసాగుతున్నారు.

భూపాలపల్లి నియోజకవర్గవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన రవిపటేల్..పేద ప్రజల సమస్యల పరిష్కారానికి ఎన్నో పోరాటాలు ప్రజల పక్షాన తీన్మార్ మల్లన్న టీం నుంచి చేశారు. ఎంతో మందికి ఆర్థిక సహాయం చేశారు. వైద్యం విషయమై ఎంతో మందికి ఆర్థిక సాయం చేశారు. ఐదేండ్ల నుంచి భూపాలపల్లి జిల్లాతో పాటు నియోజకవర్గంలో నిర్విరామంగా ప్రజలకు సేవ చేస్తున్నారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలతో పోటీపడుతూ దూసుకెళ్తున్నారు.

యువతను మేలుకొలుపుతూ ఎన్నో అంశాల మీద పోరాడిన రవి పటేల్ కు.. యువత మద్దతు పెద్ద ఎత్తున మెండుగా ఉండటం విశేషం. భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని బడుగు, బలహీన, నిరుపేద వర్గాల తరఫున వారి గొంతుకగా..సమస్యల పరిష్కారానికి రవిపేటల్ ముందుండి పోరాడుతున్నారు. కష్టాల్లో ఉన్న వారిలో భరోసా నింపుతూ ముందుకు సాగుతున్నారు. యువతను మేల్కొలుపుతూ వారికి దిశా నిర్దేశం చేస్తున్నారు.

 

భూపాలపల్లి నియోజకవర్గంలో 30 వేల మంది టీం సభ్యులతో ఒక బలమైన లీడర్ గా రవి పటేల్ దూసుకెళ్తున్నారు. రవిపటేల్ నియోజకవర్గ పరిధిలోని ప్రతీ గ్రామంలో దాదాపుగా పర్యటించారు. శుభ, అశుభ కార్యక్రమాలకు హాజరై వారిని పలకరిస్తున్నారు.

ఐదేండ్ల నుంచి ప్రజాభిమానం, విశ్వాసం చూరగొన్న రవిపటేల్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగారు. నిత్యం నియోజకవర్గ ప్రజానీకానికి అందుబాటులో ఉండే తనను ఎమ్మెల్యే గా గెలిపించాలని ఈ సందర్భంగా రవిపటేల్ కౌటం ప్రజలను అభ్యర్థిస్తున్నారు.

బీసీ మున్నూరు కాపు బిడ్డగా ప్రజల ముందరకు వస్తున్న తనను ఆదరించి.. ఆశీర్వదించాలని రవిపటేల్ భూపాలపల్లి నియోజకవర్గ జనాన్ని కోరుతున్నారు.

ప్రొఫైల్:
పూర్తి పేరు: కౌటం రవి పటేల్
తల్లిదండ్రులు: రాజమల్లు-భాగ్యము
కుటుంబం: రవిపటేల్ సతీమణి-సౌమ్య
పిల్లలు: భీష్మ పటేల్, శివగంగా పటేల్
స్వగ్రామం: గొర్లవీడు, భూపాలపల్లి
ప్రస్తుత చిరునామా: భూపాలపల్లి
విద్యార్హత: డిగ్రీ (బీఏ)