వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
భూపాలపల్లి రూరల్ నాగారం గ్రామానికి చెందిన గౌరీబోయిన రాజయ్య ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న తీన్మార్ మల్లన్న టీం భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్, టీం సభ్యులు మృతుడి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. నిరుపేద కుటుంబమైన వారికి ఒక రైస్ బ్యాగు నిత్యావసర సరుకులు ఇచ్చారు. భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని రవి పటేల్ చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కడు పేదరికంలో ఉన్న వారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కనీసం ఒక ఇల్లు కూడా సరిగా వారికి లేదని, తాటి కమ్మలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని వివరించారు. ప్రభుత్వం వెంటనే ఆ కుటుంబానికి ఒక ఇల్లు మంజూరు చేయాలని, ఆర్థికంగా వారిని ఆదుకోవాలని రవి పటేల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఎస్టీ కోయ బ్యాక్వర్డ్ దిగువ తరగతిలో కు చెందిన ఇలాంటి వారిని ఇంకా ఎవరైనా ఆదుకునే వారు ఉంటే వెంటనే వారికి తోచిన సహాయం చేయాలని రవి పటేల్ విజ్ఞప్తి చేశారు. తీన్మార్ మల్లన్న టీం ఏ అధికారం లేకపోయినా ఎల్లవేళలా నిరుపేద ల పక్షాన నిలబడుతోందని చెప్పారు.

సామాన్యుడికి కష్టం వస్తే ‘‘మేమున్నామంటూ’’ తీన్మార్ మల్లన్న తక్షణమే స్పందించి వారిని ఆదుకుంటున్నారని వెల్లడించారు. భూపాలపల్లిలో ఏ మూలన ఎవరికి సమస్య వచ్చినా తీన్మార్ మల్లన్న టీం అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం దిశగా ఎల్లవేళలా పనిచేస్తోందని రవి పటేల్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు గండు కరుణాకర్, మాడే సంతోష్ కుమార్, మోటుపోతుల సమ్మయ్య, సీడం శ్రీనివాస్, సిడం సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.