- భూపాలపల్లిలో ప్రధాన పార్టీలకు ధీటుగా స్వతంత్ర అభ్యర్థి పోటీ
- నిత్యం అందుబాటులో ఉండే తనను గెలిపించాలని ప్రజలకు అభ్యర్థన
- ఈవీఎంలో సీరియల్ నెం.17 ఏసీ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి
వేద న్యూస్, భూపాలపల్లి:
భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీలకు భిన్నంగా సరికొత్త ఆలోచనలతో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ రవిపటేల్ ఎన్నికల బరిలో దూసుకెళ్తున్నారు. ఉచిత విద్య, వైద్యం, సత్వర న్యాయం, అవినీతి లేని పరిపాలన, రైట్ టు రీకాల్ వంటి అంశాలను జనంలో చర్చకు పెడితూ..యువత మద్దతుతో జనంలోకి వెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న తాను ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం పని చేస్తానని స్పష్టం చేస్తున్నారు.
తీన్మార్ మల్లన్న టీమ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పాటు నియోజకవర్గవ్యాప్తంగా సేవలు చేస్తున్నట్లు వివరిస్తున్నారు. దాదాపు 30 వేల మంది టీమ్ సభ్యులతో ప్రజల మద్దతు కూడగడుతున్నారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన బహుజనవాదినైన తనకు సీరియల్ నెం.17 ఏసీ(ఏయిర్ కండిషనర్) గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. నిత్యం జనంకు అందుబాటులో ఉంటూ..వారి కష్ట, నష్టాల్లో, ఆపదలో అన్ని వేళలా.. అండగా ఉన్న..తనను ఆదరించి ఆశీర్వదించాలని రవిపటేల్ కోరుతున్నారు. బహుజనవాదిని అయిన తనను..బహుజన వాదాన్ని గెలిపించాలని భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలను రవిపటేల్ కోరుతున్నారు.
గత ఐదేండ్ల కాలం నుంచి ప్రజలకు వైద్యం విషయమై తనకు తోచినంతలో సాయం చేస్తూ..ఆపరేషన్లు సైతం రవిపటేల్ చేయించారని ప్రజలు వివరిస్తున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే మనస్తత్వం, ఆదర్శ వ్యక్తిత్వం కలిగిన రవిపటేల్ ను ప్రజలు తప్పక ఆదరిస్తారని ఆయన వర్గీయులు, తీన్మార్ మల్లన్న టీమ్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బహుజన బిడ్డగా ప్రజల్లో ఉంటున్న రవిపటేల్ ప్రజలకు సుపరిచితులని, నిత్యం జనంలో ఉండే రవిపటేల్ కు రోజురోజుకూ మద్దతు పెరుగుతోందని పలువురు పేర్కొంటున్నారు.
యువకుడైన రవిపటేల్ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరో 40 ఏండ్ల పాటు ప్రజల కోసం పాటు పడతారని తీన్మార్ మల్లన్న టీమ్ సభ్యులు, యువకులు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు జనానికి వివరిస్తున్నానరు. ఇటీవల మున్నూరు కాపు సంఘం రవిపటేల్ కు పూర్తి మద్దతునిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తెలిపారు. ప్రజలు సైతం మార్పు కోసం స్వతంత్ర అభ్యర్థి వైపు చూస్తున్నట్లు చర్చ జరుగుతోంది. చూడాలి మరి..ఈ అసెంబ్లీ ఎన్నికలలో రవిపటేల్ ఏ మేరకు ప్రభావం చూపుతారో..