వేద న్యూస్, వరంగల్:
ఫిబ్రవరి 7న హైదరాబాదులో నిర్వహించే వెయ్యి గొంతులు.. లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు. సోమవారం దామెర మండల కేంద్రం నుంచి నాయకులు హనుమకొండకు సకల జనుల సంఘీభావ ర్యాలీకి తరలి వెళ్లారు.
ఎస్సీ వర్గీకరణ అమలు కోసం లక్షల డప్పులు వేల గొంతుకలు పేరిట భారీ సాంస్కృతిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఎంఆర్పిఎస్ నాయకులు దామెర నుంచి తరలి వెళ్లారు.కార్యక్రమంలో నాయకులు వేల్పుల రాజ్ కుమార్, వేల్పుల శ్రీనివాస్, దామెర రవీ , దామెర రమేష్, వేల్పుల శ్రీను , నక్క రాజేందర్, కొడకండ్ల శీను, దామెర సుమన్ ఈరెల్లి , హరీష్ దామెర రాజు, బాబు , ప్రసాద్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.