వేద న్యూస్, ఎలిగేడు:
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల పరిధిలోని లాలపల్లి గ్రామ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో సోమవారం ఉదయం ధ్వజస్తంభ పునర్నిర్మాణ కార్యక్రమం అంగరంగ వైభవంగా గ్రామ ప్రజల సమక్షంలో నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే లాలపల్లి మల్లికార్జున స్వామికి ధ్వజస్తంభ నిర్మాణానికి అనేకమంది దాతలు ముందుకు వచ్చి సహాయం చేయడం వల్ల పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొప్పర రాజేశ్వర్ రెడ్డి, మాజీ చైర్మన్ గుర్రం మల్లారెడ్డి, మాజీ సర్పంచులు సింగిరెడ్డి ఎల్లవ్వ, చిగుర్ల లత, రెడ్డి సంఘం చైర్మన్ బద్దం మల్లారెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, రాఘవరెడ్డి, రాములు, మల్లారెడ్డి, హనుమంత రెడ్డి, ఢిల్లేశ్వర్ రెడ్డి ,కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.