వేద న్యూస్, మరిపెడ:
డోర్నకల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్ పాల్గొని మాట్లాడారు. ఈ మీటింగ్ గురువారం జరగగా, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని రెడ్యానాయక్ సూచించారు. బీఆర్ఎస్ నాయకులు సైనికుల వలే పని చేయాలని అన్నారు. రాబోయేది బీఆర్ఎస్ సర్కారేనని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, యువ నాయకులు రవిచంద్ర, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
