•  ఆంగ్లంలో నైపుణ్యం అవసరం
  •  సీతారాంపురం హెచ్ఎం రామచంద్రు

వేద న్యూస్, మరిపెడ:
మరిపెడ మున్సిపాలిటీలోని సీతారాంపురం పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ రామచంద్రు పాఠశాల స్థాయిలో జరిగిన స్పెల్ రిజార్డ్ ఆంగ్ల ప్రశ్నాపత్రాల ను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజులలో ఇంగ్లిష్ ప్రాధాన్యత చాలా పెరిగిందని చెప్పారు.

ఇంగ్లిష్ నైపుణ్యాలు పెంపొందించుకున్నట్లయితే, ఎక్కడికి వెళ్లినా కూడా మనము రాణించగలుగుతామని తెలిపారు. ప్రతీ విద్యార్థి కూడా ఆంగ్లం పైన అత్యంత శ్రద్ధ వహించి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని చెప్పారు.

కార్యక్రమంలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బయగాని రామ్మోహన్ మాట్లాడుతూ ఈ స్పెల్ రిసార్ట్ పరీక్షలో ఎంపికైన విద్యార్థులు మండల స్థాయికి పంపించబడతారని చెప్పారు. మండల స్థాయిలో ఈ నెల 29న మళ్లీ పోటీ పరీక్ష ఉంటుందని చెప్పారు. జాయింట్ సెక్రటరీ భూమా వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.