• డ్రింకింగ్ వాటర్ లో డ్రైనేజీ లీకేజీ
  • రూ.72 లక్షలు ఖర్చుపెట్టినా తాగునీటికి తిప్పలు
  •  అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించండి 
  • ప్రత్యేక అధికారికి బీజేపీ నేతల వినతి

వేద న్యూస్, వరంగల్:

హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని దేవునూర్ గ్రామంలో తాగునీటి కోసం రూ.72 లక్షలు ఖర్చుపెట్టినా.. నేటికీ లీకేజీ అయిన డ్రైనేజీ వాటర్ మాత్రమే సరఫరా అవుతున్నాయని బీ జే పీ నేతలు పేర్కొన్నారు. ఈ విషయమే వెంటనే తగు చర్యలు చేపట్టాలని గ్రామ ప్రత్యేక అధికారి ల్, నాయబ్ తహశీ ల్దార్ ను ఆయన ఆఫీసులో గురువారం కలిసి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా బీజేపీధర్మసాగర్ మండల ప్రధాన కార్యదర్శి కొంగంటి సందీప్, బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు సంగెకారి యువరాజు మాట్లాడుతూ.. గ్రామంలోని సమస్యలు పరిష్కరించాలని స్పెషల్ ఆఫీసర్ కు విన్నవించినట్టు పేర్కొన్నారు.

దేవునూర్ గ్రామంలో అర్హులకు (ప్రధాన మంత్రి అవాస్ యోజన) ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. మిషన్ భగీరథ స్కీం కింద లక్షల రూపాయలు గ్రామ తాగునీటి అవసరాల నిమిత్తం ఖర్చుపెట్టినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేసినట్టు వెల్లడించారు.