•  మంత్రి కొండా సురేఖకు వినతి పత్ర సమర్పణ

వేద న్యూస్, వరంగల్:
అమ్మవారి పేట సమ్మక్క సారలమ్మ జాతరకు తగు ఏర్పాట్లు చేయాలని అటవీ శాఖ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖను జాతర కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు మంత్రికి వారు మంగళవారం వినతి పత్రం సమర్పించారు. జాతరకు తగు ఏర్పట్లు చేయాలని అభ్యర్థించారు.

మంత్రికి వినతి పత్రం సమర్పించిన వారిలో జాతర కమిటీ చైర్మన్ కోడూరి భిక్షపతి, జాతర ఆర్గనైజర్ దాసి రాందేవ్, కోశాధికారి బైరి నాగరాజు, బైరి హరినాథ్, ఆవునూరి కుమారస్వామి, కోడాల పృథ్వీ, సునిత, ఆనందం, అశోక్, స్వామి, నాగరాజు, కుమారస్వామి తదితరులున్నారు.