వేద న్యూస్, ఆసిఫాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాదిలో స్థానిక సంస్థలకు ఎన్నికలకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రజలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని బీజేపీ నాయకులు సప్త శ్రీనివాస్త తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో గ్రామ పంచాయతీలలో ఒకే వ్యక్తి 2 లేదా 3 ఓట్లు కలిగి ఉన్నారని తెలిపారు.
ఓటరు గుర్తింపు కార్డులలో తప్పులు సరిదిద్దుకునేందుకు దరఖాస్తు చేసుకున్న తర్వాత కొత్త కార్డులు ఇంకా అందలేదని పేర్కొన్నారు. ఈ తప్పులన్నింటినీ సవరించాలని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎన్నికల కమిషన్ అధికారి, అధికారులను కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను అభ్యర్థించారు. పంచాయతీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున పై సమస్యలపై ఇప్పుడే దృష్టి సారించి పరిష్కరించాలని నాయకులు శ్రీనివాస్ సూచించారు.
