వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నెల రోజుల పాలన అద్భుతం అని వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ రామకృష్ణ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కొనియాడారు. ఈ 30 రోజుల వ్యవధిలో ప్రజా పాలనలో భాగంగా రేవంత్ చేసిన ప్రజ కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయని ఆయన చెప్పారు.

ఆదివారం విలేకరుల సమావేశంలో వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రజా పాలన విజయవంతంగా కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రజలకు న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో ఆరు పథకాలని ప్రవేశపెట్టి వాటిలో కొన్ని పథకాలు ఇప్పటికే మొదలుపెట్టి..విజయవంతంగా ముందుకు దూసుకెళ్తున్నారని స్పష్టం చేశారు.

ఈ 30 రోజుల్లోనే ప్రజా పాలన ఇంత అద్భుతంగా ఉందంటే రానున్న రోజుల్లో మన రాష్ట్రంలో ఇక పేద ప్రజల బ్రతుకులు మారుతాయని స్పష్టంగా అర్థమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో దేశమంతా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దేశం మొత్తం బాగుపడుతుందని రామకృష్ణ వెల్లడించారు.

రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నందున ప్రజలు గమనించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రజల ఆశీస్సులు కాంగ్రెస్ నాయకుల మీద ఉండాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో నాయకులు కిరణ్, రాజు, మహేష్, మధు అడ్వకేట్ శ్రవణ్, వరంగల్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.