వేద న్యూస్, మడికొండ :
సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని బీజేపీ వర్ధన్నపేట కో కన్వీనర్ రవీందర్ రెడ్డి, హన్మకొండ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల శ్రీకాంత్ తీవ్రంగా ఖండించారు. మడికొండలోని రేషన్ షాప్ పరిశీలిస్తు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యం ఇవి ఇంకా ఐదు సంవత్సరాల వరకు ఇలానే ఇస్తారు అని వారు ప్రజలకు తెలియజేశారు. రేషన్ షాప్ ముందు ప్రధాని మోడీ చిత్రపటాని ఏర్పాటు చేసి పాలాభిషేకం చేశారు.
అనంతరం బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబెర్ దువ్వ నవీన్ మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమమే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమని అన్నారు. కరోనా సమయం నుంచి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఐదు కిలోల ఉచిత బియ్యన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం ఒక కిలో మాత్రమే అని అన్నారు. అదేవిధంగా ప్రతి రేషన్ షాప్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను కచ్చితంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొలిపాక కుమార్ బాబు,కుక్కల రాకేష్,నాని,అరవింద్ ,సాయి తదితరులు పాల్గొన్నారు.