వేద న్యూస్, జమ్మికుంట:

జమ్మికుంట పట్టణంలోని రిషిక హాస్పిటల్ లో తల్లి పిల్లల సేవలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు మదర్, చైల్డ్‌కు సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ బి .రమేష్ తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్ బి రమేష్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలో గల రిషిక పిల్లల హాస్పిటల్ లో  తల్లి పిల్లల పూర్తి ఆరోగ్య సంరక్షణ ఒకే దగ్గర ఉండాలనే ఉద్దేశంతో డాక్టర్ కె .జ్యోతి రెడ్డి, స్త్రీల, ప్రసూతి వైద్యనిపులు రిషిక పిల్లల హాస్పిటల్ లో అందుబాటులో ఉండి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. 

తమ హాస్పిటల్ లో క్యాష్ లెస్ సేవలు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకము తల్లి, పిల్లలు ఉండడానికి ప్రత్యేకమైన గదులు ఉన్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని జమ్మికుంట పట్టణ, గ్రామీణ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.